పాలకవర్గ భావాలే ప్రజలు భావాలు గా చలామణి అయి ప్రజల్ని పాలిస్తాయి..
*పాలకవర్గ భావాలే ప్రజలు భావాలు గా చలామణి అయి ప్రజల్ని పాలిస్తాయి*.. మనిషి సామాజిక సంబంధాల్లోనూ అతని సామాజిక జీవితంలోనూ మార్పులు వచ్చినప్పుడల్లా అతని భావాలూ , అభిప్రాయాలు కూడా మారిపోతుండటం మనం చూస్తూంటాం. అంటే అతని చుట్టూ ఉన్న జీవితం మారినప్పుడు అతని చైతన్యమూ మారుతుంది. సమాజాన్ని విప్లవీకరించే కొన్ని భావాలను జనం వ్యక్తం చేస్తున్నారంటే,పాత సమాజం లోనే కొత్త సమాజపు అంశాలు కొన్ని పుట్టాయని అర్ధం. పాత జీవన పరిస్థితులు అంతమౌతున్న కొద్దీ పాత భావాలు కూడా అంతరిస్తాయి. ప్రాచీన ప్రపంచం మరణ శయ్యపై ఉన్నపుడు అంతకుముందు ఉన్న మతాలను క్రైస్తవ మతం తనలో కలిపేసుకుని వాటిని పూర్తిగా కనుమరుగు చేసింది. భూస్వామిక సమాజం అంతమవుతున్న దశలో ఆనాటి విప్లవ పెట్టుబడిదారీ వర్గంతో అది చివరి పోరులో ఉంది.అది పద్దెనిమిదో శతాబ్దపు కాలం. ఆ సందర్భంలో హేతువాదానికి క్రైస్తవం తలొగ్గింది. పాలక వర్గం ఆలోచనలే ప్రతి యుగంలో సమాజాన్ని పాలించే భౌతిక శక్తి . ఉత్పత్తి సాధనాలపై ఎవరికి ఆధిపత్యం ఉంటుందో వారికే మానసిక ఉత్పత్తి సాధ...