దిద్దుబాటుకు సంబంధించి నిర్మాణపరమైన చర్యలు
![చిత్రం](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgmAXHn7g54wtfK5kMlm7xKL9CiPNmZnytdIgPqvfSSIeThMAkn_KxEyZU7Y7W3pfrJlmgUlMc-0MDnDxTUbG6Gy1d9fOgMdI_N_gG2WXaCFQFWiRUESCUrpaWYPRirwc13PPceCHYm_Ho/s1600/1628336627788258-0.png)
pc: pinterest (1) అన్యవర్గ ప్రభావాలను ఎదుర్కోవడం పార్టీ వర్గ, ప్రజాపోరాటాలలో నిమగ్నమయినపుడు మాత్రమే సాధ్యమవుతుంది. పార్టీ వర్గ, ప్రజా సమస్యలను చేపట్టి వాటిపై నిరంతర పోరాటాలను నిర్వహించాలి. (2) పార్టీలోకి కొత్త సభ్యులను రిక్రూట్ చేసుకోవడం తప్పనిసరిగా పార్టీ. నిబంధనావళిలో పేర్కొన్న పద్ధతిలో జరగాలి. పార్టీ సభ్యత్వ పరిశీలన, పునరుద్ధరణ ప్రతిఏటా కచ్చితంగా జరగాలి. (3) పార్టీ శాఖలను చురుగ్గా పనిచేయించాలి. ప్రతి పార్టీ సభ్యుడు ఏదో ఒక ప్రజాసంఘంలో పనిచేసేలా చూడాలి. (4)కార్మిక వర్గం, ఇతర పునాది వర్గాలనుండి పార్టీ సభ్యులను రిక్రూట్ చేసుకోవడం ద్వారా బలపడాలి. వారి నుండి వచ్చిన కేడరును సైద్ధాంతికంగా అభివృద్ధి చేసి, ప్రమోట్ చేయాలి. పునాది వర్గాల నుండి హోల్టైమర్లుగా రావడానికి వీలు కలిగే విధంగా హోల్టైమర్లకు చెల్లించే వేతనాలు వారి కుటుంబ కనీస జీవనానికి తగినంతగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. (5) పార్టీ కమిటీల్లో విమర్శ, ఆత్మ విమర్శ జరగాలి. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలి, బ్యూరోక్రటిక్ ధోరణులను ప్రతిఘటించాలి. ఎలాంటి ముఠాకార్యకలాపాలకు పాల్పడకుండ...