పోస్ట్‌లు

ఫిబ్రవరి, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

గతి తర్కం( dialectics)

చిత్రం
గతి అంటే చలనం. ఈ చలనం వల్ల ఏర్పడే మార్పును, అభివృద్ధిని గురించి  చేసే తర్కం కాబట్టి అది  గతి తర్కం అన్నారు. ''డయలెక్టిక్‌''అనే గ్రీకు పదానికి సంభాషణ లేక వాద ప్రతివాదం అనే అర్థాలున్నాయి.        యథార్థజ్ఞానం కలగడానికి గతితార్కిక పద్ధతే ప్రధానమని ప్లేటో అభిప్రాయం. ప్లేటో తర్వాత ఈ మార్గంలో ఆలోచనా విధానానికి ప్రాధాన్యత నిచ్చినవారు కారల్‌ మార్క్స్‌, ఫెడరిక్‌ ఎంగిల్స్‌.      pic courtesy: mlpp.pressbooks.pub          Engles and Marx        చర్చల ద్వారా కాని, వాద ప్రతివాదాల ద్వారా కాని ఎదుటి వారి అభిప్రాయాలలోని లోపాలను బయటపెట్టి చివరకు సత్యాన్ని నిరూపించే శక్తిని గతి తర్కం అన్నారు గ్రీకు తత్త్వవేత్తలు .                     Buddha     గతితర్కానికి ప్రతినిధైన   బుద్దుడు ఆత్మను తిరస్కరిస్తూ ప్రపంచం మార్పు చెందుతూ నిరంతర చలనంలో వుంటుందని సూత్రీకరించాడు.ఇది భారతీయ తత్వశాస్త్రంలో ఒక విప్లవాత్మక లక్షణం....

ఏ విషయాన్నయినా సమగ్రంగా, పరస్పర సంబంధాలలో చూడాలి.

  ఏ విషయాన్నయినా పరిశీలించేటప్పుడు, విడిగా ఏ ఒక్క వాస్తవమో కాకుండా వాస్తవాల మొత్తాన్ని పరిగణనలోకి తీసుకోవాలని లెనిన్ చెప్పాడు. ఏ విషయాన్నయి. గతి తార్కికంగా విశ్లేషిస్తే, విషయాన్ని సమగ్రంగా, పరస్పర సంబంధాలలో చూస్తే కొన్ని తప్పులు కనిపిస్తాయి. కొన్ని ఒప్పులు కనిపిస్తాయి. నలుపు, తెలుపులలో స్పష్టంగా విభజన కనిపించదు. కుతర్కం చేసే వారు, ఉదారవాదులు విషయాన్ని గతి తార్కికంగా విశ్లేషించకుండా విడి విడి అంశాలు చూసి నిర్ణయాలకొస్తారు. మార్క్సిస్టు - లెనినిస్టు సమగ్రంగా విషయాన్ని అన్ని కోణాల నుంచి పరిశీలించి, వివిధ అంశాల మధ్య పరస్పర సంబంధాలు దృష్టిలో ఉంచుకుని, మొత్తం మీద మౌలికంగా ఏది తప్పు, ఏది ఒప్పు అనే నిర్ణయానికొస్తారు. ఒక మార్క్సిస్టు మేధావిని గొప్ప మార్క్సిస్టు - లెనినిష్టు అవునా కాదా అని మనం అంచనా వేసేటప్పుడు, అతను తప్పులు చేశాడా లేదా, తప్పుల శాతం ఎంత, ఒప్పుల శాతం ఎంత, ఎన్ని మార్కులు ఇవ్వవచ్చు, అని ప్రశ్న పత్రం దిద్దినట్టుగా కాక, అతను ఒక నిర్దిష్ట చారిత్రక దశలో, చారిత్రక ఆవశ్యకత గుర్తించి సమర్థవంతమైన నాయకత్వం ఇచ్చి మానవ జాతిని ముందుండి నడిపించాడా లేదా అన్నది ఆలోచించాలి. ...

జీవితం చైతన్యాన్ని నిర్ణయిస్తుందేగానీ చైతన్యం జీవితాన్ని నిర్ణయించదు.

చిత్రం
       జంతుదశ నుండి  మానవులుగా మారడమే మొత్తం మానవ చరిత్రకు సంబంధించిన అతి ప్రాథమిక విషయం. చైతన్యం, మతం ఇంకా అనేక ఇతర అంశాలను బట్టి మనుషులను జంతువుల నుండి వేరుచేసి గుర్తించవచ్చు. కానీ మానవులు తాము బతకడానికి కావల్సిన అవసరాలను ఉత్పత్తి చేసుకోవడం ప్రారంభించిన తర్వాతనే జంతువుల నుంచి తమను తాము వేరు చేసుకుని గుర్తించగలగడం మొదలైంది.       మానవుల  శరీర నిర్మాణ పద్ధతి వారు తమ అవసరాలనుత్పత్తి చేసుకోవడాన్ని నిర్ణయిస్తుంది. మానవులు తమ జీవితావసరాలను ఉత్పత్తి చేసుకోవడం ద్వారా పరోక్షంగా తమ వాస్తవ భౌతిక జీవితాన్ని సృష్టించుకుంటారు.       స్వర్గం నుండి భూమికి దిగివచ్చే జర్మన్ తత్వశాస్త్రానికి పూర్తిభిన్నంగా ఇక్కడ మనం భూమి నుండి స్వర్గానికి పయనిస్తున్నాం. ఇంకో రకంగా చెప్పాలంటే రక్తమాంసాలతో కూడిన మనుషులను అర్థం చేసుకోవడానికి, మనుషులు ఏమి చెబుతున్నారు. ఊహిస్తున్నారు ఆలోచిస్తున్నారు? అనే దానితో ప్రారంభించం. మనుషుల గురించి ఏం చెబుతున్నారు. ఆలోచిస్తున్నారు. ఊహిస్తున్నారు అనే దానితో కూడా ప్రారంభించం. వాస్తవమైన క్రియాశీలమైన మనుషుల నుండి...

నేడు అవసరమైన ఆంటోనియో గ్రాంసీ ఆలోచనలు

 నేడు అవసరమైన ఆంటోనియో గ్రాంసీ ఆలోచనలు ___బండారు రమేష్ "ఇతని మెదడు అత్యంత ప్రమాదకరమైనది. ఇతని ఆలోచనలు అత్యంత విప్లవకరమైనవి. ఈ మెదడు 20 ఏండ్ల పాటు ఆలోచించకుండా, ఇతనిని జైలులో నిర్బంధించండి” ఇది ఒక దేశ అత్యున్నత న్యాయస్థానం ఒక వ్యక్తికి శిక్ష విధిస్తూ చేసిన ప్రకటన సారాంశం. ఆ ప్రమాదకర మెదడు, ఆ విప్లవకర ఆలోచనలు ఆంటోనియో గ్రాంసీవి. భారతదేశంలో ఫాసిస్టు శక్తులు బలంగా ముందుకు వస్తున్న ప్రస్తుత తరుణంలో ఫాసిజానికి వ్యతిరేకంగా జీవితాంతం పోరాడిన గ్రాంసీని, ఆయన సైద్ధాంతిక కృషిని తెలుసుకో వాడు చాలా అవసరం. గ్రాంసీ దక్షిణ ఇటలీలోని సార్డీనియాలో 1891 జనవరి 22న జన్మించాడు.   సార్డీనియా   వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతం. గ్రాంసీ ఆ ప్రాంతంలోని రైతాంగం, వత్తిదారులు పడుతున్న కష్టాలను ప్రత్యక్షంగా చూశాడు. 1911లో ఉన్నత విద్య కోసం ఉత్తర ఇటలీలోని టురిన్ నగర విశ్వవిద్యాలయంలో చేరాడు. ఉత్తర ఇటలీ అప్పడే అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక ప్రాంతం. ఇక్కడే ఆయన వ్యవసాయాధారిత దక్షిణ ఇటలీ ప్రజలను, పెట్టుబడిదారీ ఆధారిత ఉత్తర ఇటలీ ప్రజలు తక్కువగా చూడటాన్ని గమనించాడు. ఈ తప్పుడు స్పృహ...

పరాయీకరణ సిద్ధాంతాన్ని ఎందుకు అధ్యయనం చేయాలి?

చిత్రం
“మన జ్ఞానానికి సార్ధకత లేదు. మన విశ్వాసాల మీద మనకు విశ్వాసం లేదు. మన విలువల మీద మనకు గౌరవం లేదు. మన దేవుడి మీద మనకి భక్తి లేదు. మన నాస్తికత్వం మీద మనకు నమ్మకం లేదు. మనమీద మనకి గౌరవం లేదు. మన తోటివాళ్ళ మీద మనకు మమకారం లేదు. మన ప్రజాస్వామ్యం మీద మనకు అవగాహన కాని గురి కాని లేదు. మన జ్ఞానానికి, విశ్వాసానికీ పొంతన లేదు. విశ్వాసానికీ, ఆచరణకు పొందిక లేదు. భూమి బల్లపరుపుగా వున్నప్పుడు మాత్రమే ఇలాంటి జీవితం కళ్ళబడు తుంది. మన భూమి బల్లపరుపుగా వున్నది గనుకనే మన సమాజం ఇలా వుంది." పతంజలి రచన 'పిలక తిరుగుడు పువ్వు' నవలలో మేజిస్ట్రేటు భూమి బల్లపరుపుగా ఉందని తీర్పు చెబుతూ చేసిన వ్యాఖ్యలివి.  ఈ మాటలు మన ప్రస్తుత సమాజ పరిస్థితిని చాలా చక్కగా వర్ణిస్తున్నాయి. ప్రతి వాక్యం మన చెంప చెళ్ళుమనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో బతుకుతున్న వారు పోనీ సుఖంగా వున్నారని చెప్పగలమా? ముమ్మాటికీ వీరంతా ఎంత మాత్రం సుఖంగా లేరని ఢంకా బజాయించి చెప్పవచ్చు. మనలో ఆర్థిక బాధలు లేనివారు కూడా సుఖంగా లేరు. ఎందుకు? అనడిగితే సమాధానం చెప్పలేము. నిజానికి మనకు తెలియదు. " 'కుక్క కుక్క కోసమే!' అనే జ్ఞానం ఎ...

వసంతం వస్తుంది.. ఉరికొయ్యలు సైతం పుష్పిస్తాయి..!

చిత్రం
        " అవును, మేం మౌనంగానే ఉన్నాం. అయితే మృతప్రాయులుగా మాత్రం లేం. పచ్చపచ్చగా పండి వరుగుతున్న సోషలిస్ట్ పైరులం మేం. వసంతాగమనం ఎంతో దూరంలో లేదు. ప్రపంచమంతటా పంటల తరుణం రానే వస్తోంది. స్వేచ్ఛామానవుని వసంతం, అట్టడుగు జనం వసంతం, సర్వ మానవ సౌహార్ద వసంతం, ఉరికొయ్యలని సైతం పుష్పించేలా చేసే వసంతం. ఆ వసంతానికి అభిముఖంగా మేం ముందుకు సాగుతున్నాం. "                                     ----- జ్యూలియస్ ఫ్యుజిక్                                               ( రక్తాక్షరాలు ) రణధీరుడు జ్యూలియస్ ఫ్యూజిక్ (8 సెప్టెంబర్ 1945.. బెర్లిన్ లో జూలియస్ ఫ్యూజిక్ ను ఉరి తీసిన రోజు)       మేధస్సుకు_పదునుపెట్టి, కలాన్ని కరవాలం చేసి, ఫాసిజంపై యుద్ధం చేసిన రణధీరుడితడు. మనుషులందరినీ ప్రేమించిన మనిషి ఇతడు. కమ్యూనిస్టు ఇతడు. వెలుగును, స్వేచ్ఛను ప్రేమించాడు. మొత్తంగా జీవితాన్ని ప్రేమ...

జర్మన్ ఐడియాలజీ ఏం చెపుతోంది?

చిత్రం
           1845వేసవి కాలంలో మాంచెస్టరు నుంచి బ్రస్సెల్స్ కు తిరిగి వచ్చేసరికి తాము రాసిన పవిత్ర కుటుంబం గ్రంథానికి యువ హెగెలియన్స్ నుంచి అనేక ప్రశ్నలు వచ్చాయి. దాంతో పవిత్ర కుటుంబంలో పూర్తిగా వివరించని అంశాల గురించి తెలియ జేయాల్సిన అవసరాన్ని గుర్తించారు  మార్క్స్, ఏంగెల్స్ లు.  వారిరువురూ రాసిన 'జర్మన్ ఐడియాలజీ' అనే పుస్తకాన్ని విడుదల చేశారు.        కార్మికవర్గం కమ్యూనిస్టు వ్యవస్థను సాధిస్తుందని, శాస్త్రీయ  కమ్యూనిస్టు సిద్ధాంతానికి తాత్విక ప్రాతిపదికగా చరిత్ర పట్ల  భౌతికవాద దృక్పథాన్ని స్పష్టం చేశారు. గతంలో జరిగిన విప్లవాలు వర్గాలనూ, వర్గ   పాలనను తొలగించలేదు. కమ్యూనిస్టు విప్లవం పాలనను, వర్గాలనూ అంతం చేస్తుందని విశదీకరిస్తూ అదే సమాజ పురోగమనానికి మార్గమని, సామాజిక చలన నియమాలు ఈ సత్యాన్ని రుజువు చేస్తున్నాయని ఈ గ్రంథంలో వివరించారు.        ప్రకృతి, మానవుల మధ్య వున్న  పరస్పర చర్యల ద్వారా  అంటే ప్రకృతి - మానవుల గతితర్కంపై మానవ జాతి నాగరికత నిర్మాణమైందని చారిత్రిక భౌతిక...

శత వసంతాల కమ్యూనిస్టు ఉద్యమం

చిత్రం
       pic source: cpimwb.org.in శత వసంతాల కమ్యూనిస్టు ఉద్యమం కమ్యూనిస్టు పార్టీ ఎన్నిచోట్ల గెలిచింది? ఎక్కడెక్కడ అధికారంలో ఉంది? అన్న ప్రశ్నలకు వచ్చే జవాబులు పరిమిత పరిధినే చూపించవొచ్చు. కానీ, భారతీయ సమాజం మీద, వివిధ రంగాల మీద కమ్యూనిస్టు ఉద్యమం చూపించిన ప్రభావం ఎలాంటిది అంటే మాత్రం - అది చాలా విస్తారమైనది, విస్తృతమైనది, విశిష్టమైనది. సామాన్యుల వైపు, కష్టజీవుల వైపు పట్టుదలతో పనిచేసేది ఎవరు అంటే- ఎవరైనా సరే నిర్ద్వంద్వంగా ఎర్రజెండా వైపు చూపుతారు. జనం ఒక ప్రశ్నయి పిడికిలెత్తినా, ఉద్యమమై వెల్లువెత్తినా దానిని అరుణపతాకపు చైతన్యంగానే సరిపోల్చుతారు. త్యాగనిరతి, పోరాట పటిమ, ఉజ్వల చరిత అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ కమ్యూనిస్టుల సొంతం. ఆటుపోట్లు, ఒడుదుడుకులూ ఎన్నయినా ఉండొచ్చు గాక.. ఎర్రజెండా ఎదురొడ్డి నిలుస్తోంది. జనపక్షాన నికరంగా నిలబడుతుంది. దేశంలో కమ్యూనిస్టు ఉద్యమానికి ఇది శతవసంతాల సందర్భం. భారతదేశంలో ఆ ఉద్యమ ఆవిర్భావ, విస్తరణలపై ఇదొక సంక్షిప్త అవలోకనం.       దేశంలో 19వ శతాబ్దపు చివరలో రైల్వేలు, పరిశ్రమలు స్థాపించడంతో బూర్జువా వర్గం రూపుదిద్దుకు...

కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్).

చిత్రం
(pic source:  cpimthrissurdc.wordpress.com)      1920 లో స్థాపించబడిన  అవిభక్త కమ్యూనిస్ట్ పార్టీ  విప్లవాత్మక వారసత్వం తో మార్క్సిజం-లెనినిజం కు సంబంధించిన శాస్త్రీయ, విప్లవాత్మక సిద్ధాంతాలతో ఏర్పడింది సిపిఎం.       స్వాతంత్ర్యానంతరం కాంగ్రెస్‌ పాలకులు విదేశీ రుణాలపై మారటోరియం ప్రకటించి బ్రిటిష్‌పెట్టుబడులను స్వాధీనం చేసుకునే బదులు వారితో మరింతగా కుమ్మక్కయ్యారు.  ధనస్వాములను భుజాన మోశారు. అవకాశవాద పోకడలతో అస్తవ్యస్త పరిస్థితి సృష్టించారు. ఈ నేపథ్యంలో మరింత సమరశీల పోరాటాలకు సిద్ధమయ్యే బదులు వారిపట్ల మెతక వైఖరి అనుసరించాలని కమ్యూనిస్టు ఉద్యమంలోనే కొందరు ప్రతిపాదించారు.        దాంతో విభేదించిన పుచ్చలపల్లి సుందరయ్య, ఎ.కె.గోపాలన్‌, బి.టి.రణదివే, హరికిషన్‌ సింగ్‌ సూర్జిత్‌, పి.రామమూర్తి, ప్రమోద్‌దాస్‌గుప్తా, మాకినేని బసవపున్నయ్య, జ్యోతిబాసు, నంబూద్రిపాద్‌, ముజఫర్‌ అహ్మద్‌, తదితరులు తీవ్ర సైద్ధాంతిక పోరాటం నడిపారు. అంతేగాక సరైన విప్లవకర సిద్ధాంత  కోసం ప్రజా పోరాటాల పదును పెంచడం కోసం నూతన సంస్థను స్థాపించాలన...

జీవితంలో ఏం కావాలో మనమే నిర్ణయించుకోవాలన్న మార్క్స్

మార్క్సిస్ట్ విప్లవ రాజకీయాలు చాలా ప్రత్యేకమైనవని 20వ శతాబ్దానికి చెందిన చాలామంది భావిస్తారు. సామాజిక న్యాయం, సమాజంలో తీసుకురావాల్సిన మార్పులకు మార్క్స్ ఆలోచనలు చాలా అనువైనవి. ఎంతో ప్రత్యేకమైనవి. అయితే ఆయన ఓ మానవతావాది, ఉన్నత లక్ష్యాలున్న నాయకుడు అన్నది నిర్వివాదం. ప్రపంచాన్ని మరింత సౌకర్యవంతంగా చేయడంలో ఆయన ఆలోచనలు, విధానాలు ఎంతో సహాయం చేశాయి. కార్ల్‌ మార్క్స్ కొన్ని అంశాలను చక్కగా అంచనా వేశారు. కొద్దిమంది సంపన్నులు తెరపైకి వచ్చి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసిస్తారని, పెట్టుబడిదారీ విధానం ప్రజలను గందరగోళానికి గురిచేస్తుందని, ఆర్థిక సంక్షోభాలు ప్రజలను దాదాపు చంపేసినంత పని చేస్తాయని ఆయన హెచ్చరించారు.  మీకు ఫ్రీ టైం ఉండాలి. దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మీరే నిర్ణయించుకోవాలి. ఇప్పుడు మీరు రోజుకు 24 గంటలు పనిచేయడం లేదు.వారంలో 7 రోజులూ ఫ్యాక్టరీకి / ఆఫీస్‌కి వెళ్లడం లేదు.డ్యూటీ మధ్యలో లంచ్ బ్రేక్ తీసుకోవచ్చు.రిటైర్మెంట్ తర్వాత వృద్ధాప్యంలో పెన్షన్ అందుకునే వెసులుబాటు కూడా కొందరికి ఉంటుంది.ఈ సౌకర్యాలు మీకు సంతృప్తిని కలిగిస్తున్నాయా? మీ సమాధానం అవును అయితే, మీరు తప్పకుండా కార్ల్ మార్క్స్‌కి క...

మనిషి తన సహజ స్వభావాల్ని కోల్పోవడమే పరాయీకరణ

చిత్రం
మనిషి ఒక జీవమున్న యంత్రంగా మారిపోతున్న వేళ                 __ పిళ్లా కుమారస్వామి   మనిషి మట్టి పరిమళాన్ని కోల్పోయాడు ప్రాణ పరిమళాన్ని కోల్పోయిన ఒట్టి కాగితం పువ్వు మనిషి            - మల్లెల నరసింహమూర్తి ( మట్టిగాంతుక) ఇలా మనిషి కోల్పోయిన సహజస్వభావాన్ని కవులు గుర్తించినంతగా ఎవరూ గుర్తించ లేకపోయారు. మనిషి తన సహజ స్వభావాల్ని కోల్పోవడం పరాయీకరణ. ఇది ప్రపంచీకరణ ప్రారంభమయ్యాక ప్రస్ఫుటంగా కనిపించింది. ప్రపంచీకరణ ప్రారంభంలో అర్థం కాక అయోమయంలో నున్న కవులు, కళాకారులు, రచయితలు ప్రపంచీకరణ సునామీ తరువాత పరాయీకరణను బాగా గుర్తించారు. తమ రచనల్లో ఒక నోస్టాల్జియాతో, ఒక ఆవేదనతో, ఆక్రందనతో మనిషి కోల్పోయిన దాన్ని వ్యక్తీకరించారు.          పరాయీకరణ భావనను మొట్టమొదట ప్రవేశపెట్టిన వ్యక్తి హెగెల్. మానవుడు తన పరిణామ క్రమంలో ప్రకృతి నుంచి తాను ఏర్పరచుకున్న ఆధ్యాత్మిక భావాల నుంచి వేరుపడడం మొదలైనప్పటి నుంచి మనిషి పరాయీకరణ ప్రారంభమైందని హెగెల్ భావించాడు.       హెగెల్ తరువాత పరాయీకరణ భావనను ఒ...

పరాయీకరణ(alienation) అంటే ఏమిటో వివరించిన 1844 ఆర్థిక రాత ప్రతులు

చిత్రం
రాజకీయ అర్థశాస్త్ర అధ్యయనానికి 1843లో మార్క్స్ పారిస్ వెళ్ళారు. రాజకీయ అర్థశాస్త్ర విమర్శలో మార్పు చెప్పిన భావాలకూ, ఊహలకూ పునాదులు ఇక్కడే ప్రారంభమయ్యాయి. ఈ భావాలనే కొంత కాలం తరువాత మార్క్స్ తన సంప్రదాయ గ్రంథమైన "పెట్టుబడి" లో పూర్తిగా వివరించారు. అయితే 1848లో, యీ విప్లవాత్మక తాత్విక సిద్ధాంత నిర్ధిష్ట రూపాన్ని "కమ్యూనిస్టు ప్రణాళికలో మార్క్స్, ఏంగెల్స్ లు వివరించారు. తరువాత కాలంలో మార్పు రచనలూ, ఇతర మార్కిస్టు మేధావుల రచనలూ కమ్యూనిస్టు ప్రణాళికలోని సిద్ధాంతాలపై రుజువులు సాధించి సుసంపన్నం చేశాయి రాజకీయ అర్థశాస్త్రంలోని సమస్యలకు ఒక క్రమమైన వివరణల కొరకు ప్రయత్నించిన మార్క్స్ తొలి రచన ఇ.పి.యం. 1844. ఆనాటి ఆర్ధిక, తాత్విక సిద్ధాంతాలపై మార్క్స్  విమర్శనాత్మక విశ్లేషణ యొక్క సంశ్లేషణ యీ గ్రంథంలో వుంది. తన ఆలోచనలో వున్న అనుమానాలను తనకు తానే నివృత్తి చేసుకోవడానికి 1844 రాత ప్రతులను మార్క్స్ రాశారని చాలామంది విశ్వసిస్తారు. ఇ.పి.యం. 1844, ఒక అసంపూర్తి రచన. ఇది మార్చు తొలి రచనల చిత్తు ప్రతిలోని ఒక భాగం. ఈ రాత ప్రతులలోని చాలా భాగం లభ్యం కాలేదని మార్క్స్, ఏంగెల్స్ రచనల ప...

మీడియా మీద ఓ కన్నేసి ఉంచండి

చిత్రం
        pic source: the indian wire ప్రభుత్వం గురించి మార్క్స్ హెచ్చరించారు.. మీడియా మీద ఓ కన్నేసి ఉంచాలన్నారు. ప్రభుత్వం - కార్పొరేట్ కంపెనీల మధ్య సన్నిహిత సంబంధాలు ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఓటర్ల మనోభావాలను ప్రభావితం చేసే వ్యవస్థలను సృష్టించే కంపెనీలకు ఫేస్‌బుక్ తన యూజర్ల వ్యక్తిగత వివరాలను అందిస్తే ఎలా ఉంటుంది? 19వ శతాబ్దంలో మార్క్స్, ఏంగెల్స్ సరిగ్గా ఇలాంటి అభ్యంతరాలనే లేవనెత్తారు. కానీ ఆనాడు వాళ్లేమీ సోషల్‌ మీడియాలో చురుగ్గా లేరు! కానీ ఈ ప్రమాదాన్ని చాలా ముందుగా పసిగట్టి, దాన్ని విశ్లేషించిన మొదటి వాళ్లు మార్క్స్, ఏంగెల్స్‌లేనని బ్యూనస్‌ఎయిర్స్‌ యూనివర్శిటీ ప్రొఫెసర్ వాలేరియా వెగ్ వీస్ చెప్పారు. వాళ్లు (మార్క్స్, ఏంగెల్స్) ఆ కాలంలో ప్రభుత్వం, బ్యాంకులు, వ్యాపార కంపెనీలు, ఏజెంట్ల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలను అధ్యయనం చేశారు. దీనిపై పరిశోధన చేస్తూ 15వ శతాబ్దం నాటి పరిస్థితులనూ విశ్లేషించారని వాలేరియా తెలిపారు. సుదీర్ఘ అధ్యయనం తర్వాత వారొక నిర్ణయానికి వచ్చారు. ఆ ప్రక్రియ మంచిదైనా, చెడ్డదైనా అది ప్రభుత్వానికో లేదంటే వ్యాపార సంస్థకో ప్రయోజనం చేకూర్చేలా ఉ...

మార్పుకు ప్రజలే ప్రతినిధులు!

చిత్రం
        source Getty images via wbur.org         సమాజంలో ఏదైనా తప్పుంటే మీకు అన్యాయం, అసమానత్వం జరుగుతోందని భావిస్తారు. దాన్ని నిలదీస్తారు. నిరసన తెలుపుతారు. తప్పుడు దారిలో వెళ్తున్న సమాజాన్ని సరైన మార్గంలో పెట్టేందుకు ప్రయత్నిస్తారు.           19వ శతాబ్దంలో బ్రిటన్‌ కొత్త పెట్టుబడిదారీ వ్యవస్థ ఎటూ కదలకుండా మెదలకుండా ఉండే కార్మిక శక్తిని చూసి ఉంటుంది.కానీ మార్పు వస్తుందని కార్ల్ మార్క్స్ నమ్మారు. మార్పు కోసం కార్మికులను ప్రోత్సహించారు. ఆ తర్వాత ఈ ఆలోచన సత్ఫలితాలిచ్చింది.        వ్యవస్థీకృత నిరసనలు, పోరాటాలు సమాజాన్ని సమగ్రంగా మార్చేందుకు ఎంతో దోహదం చేశాయి. ముఖ్యంగా జాతి వివక్ష వ్యతిరేక చట్టాలు, పేద, ధనిక వివక్ష వ్యతిరేక చట్టాలు రావడానికి కృషి చేశాయి. "సమాజాన్ని మార్చాలంటే విప్లవం రావాలి. మెరుగైన సమాజం కోసం మేం ఉద్యమిస్తాం. మా పోరాటం ఫలితంగానే ఉద్యోగులకు జాతీయ ఆరోగ్య పథకం వచ్చింది. రోజుకు 8 గంటల పని విధానం అమల్లోకి వచ్చింది" అని లండన్‌లో మార్క్సిజం ఉత్సవాన్ని నిర్వహించిన వారిలో ఒకరైన లూయిస్ న...

పిల్లలు పనిబాట కాదు బడిబాట పట్టాలి!

ఆధునిక ప్రపంచంలో దాదాపు అందరి ఆశ, ఆకాంక్ష ఇదే. పిల్లలు ప్రయోజకులు కావాలంటే విద్య ముఖ్యమని ఇప్పుడు ప్రపంచం గుర్తిస్తోంది. కానీ 1848లోనే కార్ల్ మార్క్స్ ఈ విషయం గుర్తించారు. పిల్లలు పలుగు, పార పట్టకూడదు. పలకా బలపం పట్టాలని ఆనాడే చెప్పారు. 'కమ్యూనిస్టు మేనిఫెస్టో' రాసేటపుడే బాల కార్మికులు ఉండరాదని ఆయన ఆకాంక్షించారు. కానీ ఇప్పటికీ ప్రతి పది మంది బాలలలో ఒకరు కార్మికులుగానే ఉన్నారు. 2016లో అంతర్జాతీయ కార్మిక సంఘం చెప్పిన లెక్కలివి. అయితే, కార్ల్ మార్క్స్ పోరాటం వల్ల చాలా మంది చిన్నారులు ఫ్యాక్టరీల నుంచి పాఠశాల బాట పట్టారు. అది కార్ల్ మార్క్స్ చేసిన కృషే. "ప్రభుత్వ స్కూళ్లలో పిల్లలందరికీ విద్య, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అనేది కార్ల్ మార్క్స్, ఏంగెల్స్‌ కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలోని పది పాయింట్లలో ఒకటి" అని 'గ్రేట్ ఎకనమిస్ట్స్: హౌ దెయిర్ ఐడియాస్ కెన్ హెల్ప్ అజ్ టుడే' పుస్తక రచయిత లిండా యూహ్ అన్నారు. పిల్లలకు చదువుకునే హక్కు గురించి చెప్పిన వారిలో మార్క్స్, ఏంగెల్స్‌లే మొదటివారు కాదు. కానీ "ప్రాథమిక విద్య తప్పనిసరి అని 19వ శతాబ్దంలో వచ్చిన చైతన్యానికి మార్క్సిజం క...

కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా చీలిక

కమ్యూనిస్టుల అధ్వర్యంలో సాగిన తెలంగాణ సాయుధపోరాటం, తెభాగ, పునప్రవాయలార్ ఉద్యమాలు అందులో గ్రామీణ రైతాంగం కదిలిన తీరు కమ్యూనిస్టుల్లో బలమైన వర్గాన్ని చైనా వైపు మళ్లేలాచేశాయి. ముఖ్యంగా తెలంగాణ పోరాటంలో మూడువేల గ్రామాలు నిజాంనుంచి విముక్తి పొంది కమ్యూనిస్టు గ్రామ కమిటీల అధ్వర్యంలోకి రావడం అనేది చైనా మార్గం వారికి అత్యంత ఉత్సాహమిచ్చిన అంశం.అదే ఊపులో పోరాటం సాగిస్తే దేశంలో సోషలిజం సాధించొచ్చని అప్పట్లో అంచనాలు వేశారు.        అయితే నిజాం సైన్యాలకు వ్యతిరేకంగా పోరాటం వేరు, భారత సైన్యాలకు వ్యతిరేకంగా పోరాడడం వేరు అని అందులోని వారు కూడా తర్వాత గుర్తించారు. అప్పటికే కొమింటార్న్ అంటే కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ నుంచి కొమింఫామ్‌గా పేరు మార్చుకున్న అంతర్జాతీయ కమ్యూనిస్టు సంస్థ కూడా చైనా మార్గాన్నే ప్రతిపాదించింది. భారత కమ్యూనిస్టు పార్టీలో చైనా లైన్ ఆధిపత్యం సాధించింది. 51లో రణదివేను దించేసి చండ్ర రాజేశ్వరరావు పార్టీ నాయకత్వం చేపట్టారు.        సాయుధ పోరాటాన్ని కొనసాగించాలా విరమించాలా అనే విషయమై సుదీర్ఘ చర్చ జరిగింది. కొనసాగించాలనేవారు, విరమించాలనే వారి మధ్య ఏకాభిప్...

భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ పుట్టుక, ప్రస్థానం

చిత్రం
సోవియట్ యూనియన్‌లో బోల్షివిక్ విప్లవం విజయవంతమయ్యాక అంతర్జాతీయ స్పిరిట్ విస్తృతంగా ఉన్న రోజుల్లో అందులో భాగంగా ఆరంభమైంది కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా 1920 అక్టోబర్ 17న తాష్కెంట్‌లో. దీని వ్యవ స్థాపనలో ఎంఎన్ రాయ్ కీలకపాత్ర పోషించారు.             MNRoy ఎంఎన్ రాయ్, ఆయన సహచరి ఎవ్లిన్ ట్రెంట్ రాయ్, అబానీ ముఖర్జీ, రోసా ఫిటింగో, మహమ్మద్ ఆలీ, మొహమ్మద్ షపీఖ్, ఎంపీబీటీ ఆచార్యలు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాను సోవియట్ యూనియన్‌లోని తాష్కెంట్‌లో ప్రకటించారు. ఇందులో ఎవ్లీన్ రాయ్ అమెరికన్ కమ్యూనిస్ట్, అబానీ ముఖర్జీ సహచరి అయినటువంటి రోసా రష్యన్ కమ్యూనిస్టు. మొహమ్మద్ అలీ, మొహమ్మద్ షఫీఖ్ టర్కీలో ఖలీఫా పాలనను పునరుద్ధరించడానికి భారత్‌లో సాగుతున్న ఖిలాఫత్ ఉద్యమం తరపున రష్యా మద్దతుకోసం వెళ్లిన వారు. ఖిలాఫత్ ఉద్యమానికి గాంధీ కూడా మద్దతునిచ్చిన దశ. టర్కీకి మద్దతుగా అక్కడి బ్రిటిష్ వలసపాలనకు వ్యతిరేకంగా భారత్ నుంచి అనేకమంది ఉద్యమకారులు రోడ్డు మార్గాన మరీ ముఖ్యంగా కొందరు కాలినడకన సిల్క్ రూట్లో టర్కీ వెళ్లిన దశ. కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ సెకండ్ కాన్ఫరెన్స్ తర్వాత జరిగిన పరిణామమి...