పోస్ట్‌లు

మార్చి, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

'షైనింగ్ ఇండియా' రాగం అపశృతులు

చిత్రం
      pc: Getty images        2003-04 రిజర్వ్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారం వాజ్‌పేయి పాలన  లో సేవింగ్స్ ఖాతాల్లో 17 శాతం పెరుగుదల నమోదైంది.           పీవీ-మన్మోహన్ జోడీ ఉదారవాద ఆర్థికసంస్కరణలను  వాజ్‌పేయి ప్రభుత్వం కొనసాగించింది దానికి 'ఆర్థిక సంస్కరణల ట్రాక్-టూ' అనే పేరు పెట్టారు.అది జిలుగుల ఎకానమీ అని సంఘ్ పరివార్ దానిని వ్యతిరేకించింది. బీఎంఎస్-స్వదేశీ జాగరణ్ మంచ్ దేశ ఆర్థికసంస్కరణలను సమర్థించాయి. వాజ్‌పేయి ప్రభుత్వానికి ముందు నుయ్యి, వెనుక గొయ్యి పరిస్థితి. దాంతో ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా తన పదవి వీడాల్సి వచ్చింది. కానీ ఆర్థిక సంస్కరణలతో నాట్యం చేేేేసిన  వాజ్‌పేయి ప్రభుత్వం 'షైనింగ్ ఇండియా' రాగం అందుకుంది. అయినా, వాజ్‌పేయి ఎన్నికల్లో ఓడిపోయారు.      వాజ్‌పేయి కాలంలోని ఆర్థిక సంస్కరణలను వామపక్షాల మద్దతుతో ఏర్పడిన మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కొనసాగించింది. (బిబిసి.కామ్ ఆధారంగా)

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏడు సంస్కరణలు

దివాలా నియమావళి వ్యవసాయ చట్టాలు కార్మిక సంస్కరణలు వైద్య విద్యా సంస్కరణలు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల సరళీకరణ వస్తుసేవల పన్ను   డిమానిటైజేషన్ (నోట్లరద్దు) 

సంక్షోభం నుంచి సంక్షోభానికి!

చిత్రం
పెట్టుబడిదారీ విధానంలో ఉత్పత్తి క్రమాలు, అంత మృదువు గానూ, అంత నిరాటంకం గానూ జరిగిపోతూ వుండవు. ఈ విధానంలో, కొన్ని సంవత్సరాల కొకసారి చాలా శాఖల్లో 'సరుకుల రాసి’లో చాలా భాగం అమ్మకాలు లేకుండా నిలిచి పోయే పరిస్థితి ఏర్పడుతూ వుంటుంది. అలాంటి పరిస్థితే 'సంక్షోభం' (క్రైసిస్). సరుకు, అమ్ముడు పోకుండా నిలిచిపోతే, తర్వాత జరగాల్సిన విషయాలన్నీ కూడా నిలిచి పోతాయి. అంటే,  లాభాలూ వడ్డీలూ రావు, పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి రాదు. ఇలా అన్నీ నిలిచిపోతాయి. ఇలాంటి 'సంక్షోభాల'కూ దారి తీసే పరిస్థితుల్ని, కొన్ని అంశాలుగా ఇలా విభజించవచ్చు 1. సమాజంలో 'సమిష్టి ప్లాను'కి అవకాశం లేక పోవడం. 2.ఎక్కువ లాభం కోసం పోటీ. 3.  ఉత్పత్తుల్ని కార్మికులు కొనలేకపోవడం, 4.'అదనపు విలువ'(అంటే మిగులు సంపద) గుట్టల్ని, పెట్టుబడిదారీ వర్గం మాత్రమే వాడవలసి వుండడం   నిజానికి, ఈ అంశాలన్నీ ఒక దానితో ఒకటి సంబంధం వుండే విషయాలే. పెట్టుబడిదారీ విధానంలో భారీ పరిశ్రమలు ప్రారంభమయ్యాకే ఈ 'సంక్షోభాలు' ప్రారంభమయ్యాయి. మొదటి సంక్షోభం 1825 లో వచ్చింది. తర్వాత ఒక దాని తర్వాత ఒకటిగా సంక్షోభాలు వచ్చి...

అత్యధిక సంస్కరణలను ఎవరు అమలుపరిచారు?

చిత్రం
1991 నవంబర్ 12న విడుదలైన ప్రపంచ బ్యాంక్  'ఇండియా-స్ట్రక్చరల్ అడ్జస్ట్‌మెంట్ క్రెడిట్ రిపోర్ట్'ఇచ్చింది. దీనిని అనుసరించే ప్రధానమంత్రి అయిన పీవీ నరసింహారావు ఐఎంఎఫ్-వరల్డ్ బ్యాంక్ విధానాలకు పచ్చజెండా ఊపారు.                   pv narasimhaarao పీవీ అధికారంలో ఉన్నప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ మోడరేట్ ఎకానమీ ద్వారా మూడు చర్యలు తీసుకున్నారు. గ్లోబలైజేషన్, మార్కెట్ ఆర్థికవ్యవస్థ, మూలధన పంపిణీ. ఈ మూడింటి సాయంతో అప్పుడు ప్రపంచబ్యాంక్-ఐఎంఎఫ్ నుంచి భారీ స్థాయిలో రుణాలు అందాయి. అప్పుడు, ప్రపంచ బ్యాంక్ అన్ని షరతులూ ఒప్పుకున్నారు. మూలధనంలో నిర్మాణ మార్పులు మొదలయ్యాయి. భారతదేశంలోకి విదేశీ పెట్టుబడుల రాక మొదలైంది. లైసెన్స్ నిబంధనను తొలగించడానికి పరిశ్రమలకు రాయితీలు ఇచ్చారు.             పారిశ్రామిక ఉదారవాదం వేగంగా వ్యాపించింది. పబ్లిక్ సెక్టార్ నుంచి పెట్టుబడుల ఉపసంహరణ ఆలోచన మొదలైంది.        భారత కంపెనీలను బహుళజాతి కంపెనీల్లో చేర్చారు. బహుళజాతి కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టడం...

మోడీ సర్కారు..ప్రభుత్వ రంగం

మోడీ సర్కారు..ప్రభుత్వ రంగం 🖍️భారతదేశం లోని ప్రభుత్వ రంగాన్ని తమకు ఇష్టులైన కార్పొరేట్‌ సంస్థలకు, విదేశీ బహుళజాతి సంస్థలకు అప్పజెప్పాలన్న అభిమతాన్ని మోడీ ప్రభుత్వం ఎక్కడా దాచిపెట్టుకోవడంలేదు. ఏ ఆర్థిక సూత్రాలకు అనుగుణంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నదీ ప్రభుత్వం వెల్లడి చేయలేదు. ప్రభుత్వ వ్యయానికి కావలసిన ఆర్థిక వనరులను సమీకరించుకోడానికే ఈ విధంగా చేస్తున్నట్టు చెప్తున్నారు. ఇది ఈ ప్రభుత్వానికి ఆర్థిక పరిజ్ఞానం ఏమాత్రమూ లేదని సూచిస్తోంది. దానితోబాటు కార్పొరేట్‌ సంస్థల కోసం ఈ ప్రభుత్వం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నదని విదితమౌతోంది. 🖍️వలస పాలన నుండి విముక్తి కోసం జరిగిన పోరాటం పర్యవసానంగా ప్రభుత్వ రంగం వచ్చింది. వలస పాలన అంటే ఒక విదేశీ శక్తి మన దేశంమీద రాజకీయ అధికారం చెలాయించడం మాత్రమే అని అనుకోరాదు. మన దేశ సహజ సంపద మీద విదేశీ పెట్టుబడి ఆధిపత్యం చెలాయించడం కూడా. అందుచేత వలస పాలకుల ఆధిపత్యం నుండి విముక్తి పొందడం అంటే కేవలం రాజకీయ స్వాతంత్య్రం పొందడం మాత్రమే కాదు. విదేశీ పెట్టుబడి చేతుల్లో ఉన్న మన దేశ సంపదను మన దేశ ప్రజలందరి తరఫున స్వాధీనం చేసుకోవడం కూడా. ప్రభుత్వ రంగం మన దేశ ప్రజలందరికీ ఉమ్...

'వ్యాపారం చేయడం ప్రభుత్వం పని కాదు'_నమో

చిత్రం
         pc : Dailymotion.com 📍వ్యాపారం చేయడం ప్రభుత్వం పని కాదు" అని ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ప్రకటించారు. వ్యాపారం అంటే ఆయన దృష్టిలో ప్రభుత్వ రంగంలో పరిశ్రమలు పెట్టడం, ప్రజలకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించడం. ఆయన ఉద్దేశం ప్రకారం పారిశ్రామిక రంగం విద్య, వైద్యం ఇతర సేవలనుండి ప్రభుత్వం తప్పుకుని వాటిని స్వదేశీ, విదేశీ బడా కార్పొరేట్ కంపెనీలకు అప్పగించాలి. దేశంలోని వనరులను ప్రజల నుండి లాక్కుని ఈ కార్పొరేట్లకు అప్పగించే ఫెలిసిటేటర్ గా మాత్రమే ప్రభుత్వం ఉండాలి. అంటే దేశంలోని వనరులను ఒక క్రమపద్ధతిలో ఉపయోగించుకుని ప్రణాళిక ప్రకారం పరిశ్రమలు స్థాపించి ప్రజలకు ఉపాధి, విద్య, వైద్యం కల్పించే బాధ్యతలనుండి ప్రభుత్వం తప్పుకుని స్వదేశీ, విదేశీ ప్రయివేటు పెట్టుబడిదారులకు దేశంలోని వనరులన్నిటినీ అప్పగిస్తే వారే ప్రజలకు ఉపాధి కల్పిస్తారనే పాత సిద్ధాంతాన్నే ఆయన వల్లె వేశారు. 📍 నిజానికి ఈ సిద్ధాంతం మోడీది కాదు. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ మూడు దశాబ్దాల క్రితమే ప్రపంచం మీద రుద్దిన సిద్ధాంతం ఇది. దీన్ని అమలు జరిపే క్రమంలోనే సరళీకరణ, ప్రపంచీకరణ, ప్రయివేటీకరణ (ఎల్పిజి), "సంస్కరణల...

కార్మికులను దోపిడీ చేసే స్వేచ్ఛనిచ్చిన ప్రపంచీకరణ

చిత్రం
         ప్రధాన మంత్రి  పాములపర్తి వెంకట   నరసింహారావు, అప్పటి ఆర్థిక మంత్రి అయిన  మన్మోహన్  సింగ్ సరళీకృత విధానాలను అవలంబించటం మొదలు పెట్టారు. ఈ నియో-లిబరల్ విధానాలు ఆంతర్జాతీయ వాణిజ్యం, పెట్టుబడులు, నియంత్రణల సడలింపులు, ప్రైవేటీకరణ, పన్నుల సంస్కరణలు, ద్రవ్యోల్బణ నియంత్రణా చర్యలకు ద్వారాలు తీశాయి. అది మొదలు అధికారంలో ఏ రాజకీయ పార్టీ ఉన్నా సరళీకరణ విధానాలను మరింత  వేగంగా ముందుకు తీసుకు వెళుతున్నారు. ప్రపంచ బ్యాంక్ అన్ని షరతులూ ఒప్పుకున్నారు. మూలధనంలో నిర్మాణ మార్పులు మొదలయ్యాయి. భారతదేశంలోకి విదేశీ పెట్టుబడుల రాక మొదలైంది. లైసెన్స్ నిబంధనను తొలగించడానికి పరిశ్రమలకు రాయితీలు ఇచ్చారు.పారిశ్రామిక ఉదారవాదం వేగంగా వ్యాపించింది. పబ్లిక్ సెక్టార్ నుంచి పెట్టుబడుల ఉపసంహరణ ఆలోచన మొదలైంది.         ' స్వేచ్చావ్యాపారం,', 'పోటీ', 'సామర్ధ్యం', 'అభివృద్ధి' మొదలయిన భావాలకు ప్రాచుర్యం లభించింది. జాతీయకరణ నినాదంపోయి ప్రైవేటీకరణ నినాదం వచ్చింది. స్వయం సమృద్ధి, స్వాలంబనల స్థానంలో విదేశీ పెట్టుబడులకు 'స్వేచ్ఛ' ప్రపంచీకరణ' లక్ష్య...

సరళీకృత విధానాలకు అవసరమైన భావజాలాన్ని ప్రచారం చేసిన రాజీవ్

చిత్రం
      (Pc siasat.com) Rajiv Gandhi                                      1984లో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా దేశ పగ్గాలను చేబట్టారు. అతడు భారత ఆర్థికవ్యవస్థ, విజ్ఞానం , సాంకేతిక పరిజ్ఞానం వంటి రంగాలలో అనేక మార్పులను తీసుకవచ్చే ప్రయత్నం చేశాడు. శ్రీలంకలో అల్పసంఖ్యాకులైన తమిళుల సమస్యను పరిష్కరించడానికి రాజీవ్ గాంధీ ముందంజ వేశాడు. తమిళ సముదాయానికి దేశాంతర్గతంగా స్వయం ప్రతిపత్తిని కల్పించాలనే ఉద్దేశంతో  శ్రీలంక ప్రభుత్వానికి   అతడు మద్దతునిచ్చాడు. అయినప్పటికి అతని ఆ ప్రయత్నాలకు తగిన ఫలితం దక్కలేదు.అది LTTE నేత ప్రభాకరన్ ఆగ్రహానికి గురైంది.  రాజీవ్ గాంధీ 'సోషలిజం పేరిట జాతీయకరణ విధానాలను జరిపించడం మానేసి ఆర్థిక వ్యవస్థలో సరళీకృత విధానాలను తీసుకొచ్చారు. ప్రభుత్వరంగ సంస్థలు కేవలం ఉద్యోగాలు సృష్టించే పరిశ్రమలనీ, వీటిలో అసమర్థత పెరిగిందనీ, అందువల్ల ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించాలని చెప్పారు. నూతన ఆర్థిక విధానాలు, నూతన పారిశ్రామిక విధానాలు, నూతన విద్యావిధానాల...

స్వామినాథన్ కమిటీ సిఫారసులు

చిత్రం
            prof.   M S swaminathan   దేశంలో మెజారిటీ ప్రజలు జీవనోపాధి కోసం సాగుపై ఆధారపడుతున్నప్పటికీ జాతీయాదాయంలో వ్యవసాయ వాటా తగ్గుతున్నది. అమెరికాలో కేవలం రెండు శాతం మంది మాత్రమే వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. ఈ లెక్కన భారతదేశంలో వ్యవసాయంపై ఆధారపడినవారు అల్పాదా యాలపై జీవిస్తున్నారని రైతుసంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్వామినాథన్‌ ఎవరు..? ప్రొఫెసర్‌ ఎం.ఎస్‌ స్వామినాథన్‌ను హరితక్రాంతికి మార్గదర్శకుడిగా రైతులు కొలుస్తారు. తమిళనాడుకు చెందిన ఆయన స్వతహాగా జన్యుశాస్త్రవేత్త. 1966లో మెక్సికోకు చెందిన విత్తనాన్ని పంజాబ్‌కు తెచ్చి దేశీయ రకాలుగా మార్చారు. అత్యధికంగా గోధుమ పండే విత్తనాన్ని సృష్టించారు.       అప్పటి యూపీఏ సర్కారు రైతుల స్థితిగతు లపై ఆరా తీయటానికి వెళ్లినప్పుడు స్వామినాథన్‌ గురించి తెలుసుకున్నది. అన్నదాతకు అండగా నిలిచేలా 2004 నవంబర్‌ 18న స్వామినాథన్‌ కమిషన్‌ను వేసింది. ఈ కమిషన్‌ పలు సిఫారసులు చేస్తూ ఐదు రిపోర్టులను కేంద్రానికి సమర్పించింది. ఉత్పాదక వ్యయానికి అదనంగా 50 శాతం జోడించి కనీస మద్దతు ధర ప్రకటించాలని సూచిం...

కార్మికోద్యమాలను బలహీన పరిచిన జనతాపార్టీ పాలన

చిత్రం
           Janata party Sybil in 1975       1975లో విధించిన అత్యవసర స్థితి తరువాత విపక్ష పార్టీలన్నీ ఒకే పార్టీగా అవతరించాలని నిర్ణయించాయి. అలా ఏర్పడినదే జనతా పార్టీ. ఇందులో భారతీయ జనసంఘ్, సోషలిస్టు పార్టీ, కాంగ్రెస్ (ఓ) ముఖ్య పార్టీలు. ఈ పార్టీకి ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు జయప్రకాష్ నారాయణ నేతృత్వం వహించారు. 1977లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీని ఓడించి దేశ చరిత్రలోనే మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది జనతాపార్టీ. అప్పుడు మొరార్జీ దేశాయ్ దేశంలోనే మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి అయ్యారు.             జనతా  పార్టీ తమ  పాలనలో ప్రజాస్వామ్య విలువలను కాపాడుతామని, పారిశ్రామిక రంగంలో మార్పులు తెచ్చి చిన్నతరహా పరిశ్రమలకు ప్రాధాన్యత, ప్రోత్సాహం కల్పిస్తామని గుత్త పెట్టుబడిదారీ శక్తులను ఎదుర్కుంటామని చెప్పింది. అందుకు అనుగుణంగా చట్టాల్లో మార్పులు చేసింది.           42వ రాజ్యాంగ సవరణతో ఏర్పడిన నిరంకుశ ధోరణులను తొ...

అభివృద్ధికి హక్కులు ఆటంకమా?

చిత్రం
      pc: prajatantranews.com                            స్వాతంత్ర్యానంతర   రెండు దశాబ్దాల్లో జరిగిన పారిశ్రామిక అభివృద్ధి అంతా పెట్టుబడిదారుల అభివృద్ధే. సంక్షేమ రాజ్యం పేరుతో ప్రభుత్వం కాపాడింది పెట్టుబడిదారుల, ధనవంతుల ప్రయోజనాలే. నిత్యావసర ధరలు పెరిగి జీవన ప్రమాణం తగ్గిపోయి ప్రజలు పేదరికంలోకి నెట్టబడ్డారు. ఇందిరాగాంధీ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 'గరీభీ హఠావో' నినాదాన్ని యివ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే గతంలో జరిగిన అభివృద్ధి దేశంలో పేదరికాన్ని సృష్టించిందిగానీ తగ్గించలేదు పోయిందని అర్థమైంది.      ఇందిరాగాంధీ గరీభీ హఠావో నినాదం కంటే ముందు జాతీయకరణ విధానాన్ని తెచ్చింది. జాతీయకరణ విధానం 'సోషలిజం' తీసుకు రావడానికి మార్గమని ప్రచారం చేసింది. ప్రజలు, రాజకీయ పార్టీలు కూడా నిజమని నమ్మారు. ప్రభుత్వం బ్యాంకులను, నూనె బావులను బొగ్గు గనులను జాతీయం చేసింది. బ్యాంకులు పారిశ్రామిక వేత్తలకు ప్రాధాన్యత ఇస్తున్నాయని, రైతులకు రుణసౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారనీ, బ్యాం...

ప్రభుత్వరంగ పరిశ్రమలు ప్రైవేటు పరిశ్రమల అభివృద్ధికి సోపానాలు

చిత్రం
       pc: sakshi.com        దేశం పారిశ్రామిక ప్రగతి పాధించడానికి ప్రణాళికాబద్ధ వ్యూహాల్లో భాగంగా 1948లో 1956లో పారిశ్రామిక విధానాలను రూపొందించి పారిశ్రామిక రంగంలో ప్రభుత్వం జోక్యం చేసుకొని కీలకమైన పాత్ర వహించాలనుకున్నారు పెద్ద పెట్టుబడిదారులు. ప్రైవేటు పెట్టుబడిదారులకు భారీ పరిశ్రమలలో పెట్టుబడి పెట్టాడావికి స్తోమత లేదని, ఆబాధ్యతను ప్రభుత్వమే నెరవేర్చాలని 1958 పారిశ్రామిక విధానంలో చెప్పారు. దాంతో ప్రభుత్వరంగంలో కీలకమైన పరిశ్రమలను, భారీ పరిశ్రమలను నెలకొల్పాలని నిర్ణయించారు. ఇతర రంగాల్లో ప్రైవేటు పెట్టుబడి దారులను ప్రోత్సహించాలని కూడా చెప్పారు.  విదేశీ పెట్టుబడులపై ఆంక్షలు విధించాలని స్వదేశీ పరిశ్రమల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఎగుమతి దిగుమతి విధానాలను నియంత్రించాలని నిర్ణయించారు.ఈ ప్రణాళికను టాటా బిర్లా ప్రణాళిక అని కూడా అంటారు. పారిశ్రామిక విధాన తీర్మానం ప్రకారం   ప్రభుత్వ, ప్రైవేటు రంగాల పరిధిని స్పష్టంగా పేర్కొంటూ పరిశ్రమలను నాలుగు వర్గాలుగా విభజించారు. ఈ తీర్మానంతో మన దేశం మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకొంది. ...

ప్రగతిశీల సంస్కృతి

చిత్రం
             PC: Studio30.com           "సంస్కృతి'' అంటే, మానవుడు నాగరికతను అలవరచుకొని, నైతిక ప్రవర్తనతో, ప్రాపంచిక దృక్పథాన్ని మెరుగుపరచుకోవడం. ఈ భావన మానవ శ్రమలకు, మనుషుల  కార్యకలాపాలకు మధ్య ఉన్న సన్నిహిత సంబంధాన్ని తెలియజేస్తుంది.        ఒకవైపున, సంస్కృతి అంటే, మానవుడు సృష్టించిన సకల వస్తువులు, సామాజిక విలువలు, సాంస్కృతిక  రూపాలు, వీటన్నింటినీ సంఘటితంచేసే పద్ధతులు. మరోవైపున,   ప్రపంచాన్ని  అర్థం చేసుకొని, దాన్ని మార్చే లక్ష్యంతోజరిగే మనిషి కృషి, చైతన్యవంతంగా చేసే సృజనాత్మక కార్యకలాపాలన్నీ  సంస్కృతి అవుతుంది. ఈ అర్థంలో సంస్కృతి సమాజపు భావజాలమవుతుంది.అది నైతిక వాతావరణపు సూచికవుతుంది. అది సమాజాన్ని నియంత్రించే ఒక కనిపించని శాసనకర్తవుతుంది.       సంస్కృతిని  ప్రజాసామాన్యానికి అందుబాటులోకి తెచ్చేందుకు  ఇవి అవసరమని లెనిన్ పేర్కొన్నాడు: అవేమంటే 1) సంస్కృతికి, శ్రామిక ప్రజలకు మధ్య తరతరాలుగా వున్న కృత్రిమమైన అడ్డుగోడలను తొలగించడ...

ప్రాచీన భౌతిక వాద తాత్విక చింతన

చిత్రం
     2500 సంవత్సరాల క్రితం(క్రీ.పూ.500నాడు) మనుషులకు ప్రకృతి గురించి తెలిసినది చాలా తక్కువ. ఆ రోజుల్లో  భారతదేశంలోనూ, గ్రీస్ లోనూ కొందరు నాస్తికులు ఉండేవారు. ప్రాచీన భారతీయ నాస్తికులను చార్వాకులని, లోకాయతులని అనే వారు.       లోకాయతులు అంటే ఉన్న కనిపించే ఈ  లోకాన్నే నమ్మేవారని. వీరు పరలోకాన్ని నమ్మరు. వీరు దేవుడు, ఆత్మ లాంటి ఊహాజనిత నమ్మకాల్ని, కర్మ సిధ్ధాంతాల్ని తిరస్కరించారు. చార్వాకం లేదా లోకాయతం లేదా బృహస్పత్యం భారతదేశపు ప్రాచీన భౌతికవాదం. ఈ వాదాన్ని బోధించిన వాడు చార్వాకుడు . ఇతను ఒక మహర్షి, బృహస్పతి శిష్యుడు. నాస్తిక మత వ్యాప్తి చేసినవాడు. లోకాయత సిద్ధాంత కర్త. చార్వాక, లోకాయత, బార్హస్పతి అని అనేక పేర్లు గలవు ఈ శాఖకు. ‘లోకేషు అయతాః లోకాయత’ ‘లోకాయత’ అంటే ప్రజల తత్వశాస్త్రం అనీ ప్రజల దృక్పధం అనీ అర్ధం చేసుకోవచ్చు.         లోకాయతకు మిగతా తత్వశాస్త్రాల లాగా  ఒక మూల పురుషుడు లేడు. ఇది సామాన్య ప్రజల్లో పుట్టిన ‘అనుమాన’, ‘తర్కా’ ల ప్రభావమే. మనం భగవంతుడికి ప్రసాదం రోజూ పెడుతూనే ఉన్నాం కాని ఆయన ఎప్పుడన్నా దాన్...

అంబేద్కర్-కమ్యూనిస్టులు

చిత్రం
స్వాతంత్రోద్యమ తొలినాళ్లలో అంబేద్కర్ కమ్యూనిస్టులు కలసి పని చేశారు 1927 మహద్ లో డా.బి.ఆర్. అంబేద్కర్ ప్రారంభించిన చెరువు నీళ్లు తోడుకోవడం, మనుస్మృతి దహనం వంటి మహత్తర పోరాటాలను నాడు కమ్యూనిస్టులు బలపరిచారు. ఆయన ముఖ్య సహచరుడిగా ఉన్న ఆర్.బి. మోరే, దాదాసాహెబ్ బావురావు గైక్వాడ్ లు నాడు ఈ పోరాటాలన్నింటిలోనూ ముందున్నారు. వారే ఈ పోరాటాలకు ప్రణాళికలు రూపొందించారు. ఆ తర్వాత 1930లో మోరే కమ్యూనిస్టు పార్టీలో చేరాడు. నాసిక్ లోని దేవాలయ ప్రవేశంలోనూ కమ్యూనిస్టులు కలసి పని చేశారు. ముంబయి బట్టల మిల్లుల గిర్ని కాంగార్ యూనియన్ ఆధ్వర్యంలో కమ్యూనిస్టులు చేసిన కార్మికపోరాటాలను అంబేద్కర్ బలపరిచాడు 1938లో కార్మికోద్యమాలను అణచివేసేందుకు బ్రిటీషు ప్రభుత్వం అండతో కాంగ్రెసు ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పడ్డ ప్రొవిజనల్ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన నల్లచట్టాలకు వ్యతిరేకంగా అంబేద్కర్ నాయకత్వంలోని ఇండిపెండెంట్ లేబర్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలోని యూనియన్లు కలసి పోరాడాయి. కొంకణ్ ప్రాంతంలో ఖోతీ పేరుతో సాగుతున్న కరుడు కట్టిన దళారీ దోపిడీకి వ్యతిరేకంగా పదివేల మంది రైతులు బోట్లమీద ముంబయి అసెంబ్లీ యాత్ర సాగించార...

planning, implementation management, review ప్రణాళిక అమలు, అజమాయిషీ, సమీక్ష

చిత్రం
 ప్రణాళిక Planning      Planning is nothing but  thinking before the action takes place . It helps us to take a  peep into the future  and decide in advance the way to deal with the situations, which we are going to encounter in future. It involves logical thinking and rational decision making. ”ప్రణాళిక-ఆచరణ" అనేది ప్రతి విషయంలో ఉంటాయి. నిర్మాణం, అధ్యయనం ప్రచారం, ఆందోళన, పోరాటంలోను వుంటుంది, పై కమిటీ నిర్ణయాలను చర్చ లేకుండా అమలు జరపడం అంటే దానికి తూట్లు పొడవడం అన్నమాట. వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని వాటిని అమలు జరపాలి జాగ్రత్తతో కూడిన, లోతైన ప్రణాళిక రూపొందిస్తేనే సరిపోదు. అది వాస్తవాలపైన, పరిశీలన పైన ఆధారపడి ఉండాలి. నాయకత్వం పథకాన్ని అమలు జరపడంలో వ్యక్తిగతంగా పాల్గొనాలి. లక్ష్యాలను రూపొందిస్తేనే సరిపోదు. ఆ లక్ష్యాలను ఛేదించడానికి ఎదురయ్యే సమస్యలను కూడా పరిష్కరించాలి. ఉదా : నదిని దాటడం కర్తవ్యం అయితే పడవో వంతెనో లేకుండా దాన్ని దాటలేం. పడవ, వంతెన సమస్య పరిష్కరించకుండా నదిని దాటడం గురించి మాట్లాడటం వృధా అవుతుంది. కార్యక్రమాన్ని జయప్...

శ్రామికవర్గం ఒక్కటే నిజమైన విప్లవకర వర్గం

చిత్రం
 శ్రామికవర్గ అభివృద్ధిలో వివిధ దశలున్నాయి. బూర్జువా వర్గంతో దాని పోరాటం పుట్టుకతోనే ఆరంభమవుతుంది. మొదట కార్మికులు విడి విడిగా ఎవరికివారు పోరాడతారు. తర్వాత ఒకే చోట ఒకే ఫాక్టరీలో పనిచేసేవాళ్లంతా కలిసి పోరాడుతారు ఈ పోరాటాలన్నీ తమని నేరుగా దోచుకొనే  బూర్జువా యజమానుల మీదనే జరుగుతాయి. మొదట వారు బూర్జువా ఉత్పత్తి పరిస్థితులపై పోరాడరు; వారు ఉత్పత్తి పరికరాలపై దాడి చేస్తారు; తమ శ్రమతో పోటీచేసే విదేశీ సరుకులను ధ్వంసం చేస్తారు; యంత్రాలను పగలకొడతారు; ఫాక్టరీలను తగలబెడతారు; తమ బలంతో మళ్లీ మధ్య యుగాలనాటి పనివాని హోదాని తిరిగి సాధించాలని కోరుకుంటారు. ఈ దశలో కార్మికులు ఒకరికొకరు సంబంధం లేకుండా దేశమంతటా విసిరేసినట్టుంటారు. తమ మధ్య ఉండే పోటీ వల్ల ఎక్కడికక్కడ చీలిపోయి ఉంటారు. ఎక్కడైనా వారు కలిసికట్టుగా సంఘటిత బృందాలుగా ఏర్పడితే దానికి కారణం స్వయంగా కార్మికుల ఐకమత్యం కాదు. అది బూర్జువాల ఐకమత్యం వల్ల జరుగుతుంది. బూర్జువా వర్గం ఆ దశలో తన సొంత రాజకీయ లక్ష్యాలను సాధించుకోవాలంటే మొత్తం శ్రామికవర్గాన్ని కదిలించక తప్పదు. కొంత కాలంపాటు అలా కదిలించగలిగిన శక్తి దానికి ఉంటుంది. ఈ దశలో కార్మ...

భారతీయ కమ్యూనిజం గురించి అంబేద్కర్

చిత్రం
సోహన్ లాల్ శాస్త్రి ( బాబాసాహెబ్ సెక్రటరీ) గారితో బాబాసాహెబ్ మాటలు::: బాబాసాహెబ్ ఒకరోజు చదువుకుంటుండగా ఆయన వద్దకు వెళ్లాను, బాబా మీతో ఒక విషయం మాట్లాడాలను కుంటున్నాను అని... "మన భారతదేశంలో కమ్యూనిస్టులు పేదరికాన్నినిర్మూలించాలి"అనే నినాదంతో పనిచేస్తున్నారు. దేశ సంపదను జాతీయం చేసి ప్రజలందరికీ పంచాలి అంటున్నారు. మరి మనం కమ్యూనిస్టులతో కలిస్తే మనకు లాభమే కదా! ఎందుకంటే మనం తిండి లేని కడుపేదవారము. ఆ పార్టీ పేదరికాన్ని నిర్మూలించాలనే విషయంలో కంకణబద్దురాలై ఉంది అని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి బాబా" అన్నాను. దానికి సమాధానంగా నాకు చాలా సుదీర్గమైన వివరణ ఇచ్చారు. బాబాసాహెబ్ మాట్లాడుతూ... *పేదరికాన్ని జయించడంపై నాకెలాంటి బేధాభిప్రాయాలు లేవు. భారతీయ కమ్యూనిస్తులతో మాత్రం మనకు ఎలాంటి మేలు జరగదు. అన్నిటికంటే ముందుగా తెలుసుకోవాల్సింది ఏమంటే కమ్యూనిస్ట్ పార్టీ నాయకులందరూ బ్రాహ్మణులు లేకుంటే సవర్ణ హిందువులు. వాళ్ళు వర్ణ వ్యవస్థ గురించి మాట మాత్రంగానైనా ఆలోచించరు. ఎందుకంటే వాళ్ల ఎజెండా కేవలం ఆర్థిక విప్లవం వరకే పరిమితమైనట్టిది. నేను కమ్యూనిజం మీద వచ్చ...